ఇంటర్ స్టూడెంట్స్ కి ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే సమయాభావం వలన ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఈయర్ లో 30 శాతం సెలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సీబీఎసిఇ బోర్డి సూచనల ప్రకారం ఇంటర్ బోర్డు సిలబస్ తగ్గించినట్టు చెబుతున్నారు. ఇంటర్ ఫస్ట్ ఈయర్ తెలుగు మీదింలో 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు చెబుతున్నారు.
అలానే ఇంటర్ సెకండ్ ఈయర్ లో హిస్టరీ, ఏకానామిక్స్,పొలిటికల్ సైన్స్ (సివిక్స్) ,జియోగ్రఫి,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్,అకౌంటెన్సీ లో కూడా ఇంటర్ బోర్డు సిలబస్ ను కుదించినట్టు తెలుస్తోంది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 కి మాత్రమే వర్తిస్తుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ తగ్గించిన సిలబస్ ఇంటర్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ కుదించిన సిలబస్ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు