టిక్‌టాక్ బ్యాన్‌పై వెనక్కి త‌గ్గిన అమెజాన్.. కారణమేంటి..?

-

టిక్‌టాక్ యాప్‌ను త‌మ ఫోన్ల నుంచి తీసేయాల‌ని కోరుతూ ఉద్యోగుల‌కు మొయిల్ పంపిన అమెజాన్ సంస్థ కొన్ని గంటల్లోనే తమ మార్చుకుంది. పొర‌పాటుగా ఈ- మొయిల్ పంపామ‌ని, టిక్‌టాక్ నిషేధంపై ప్ర‌స్తుతం త‌మ‌కు ఎలాంటి విధానాలు లేవ‌ని పేర్కొంది. అయితే టిక్‌టాక్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు సంబంధించి ఏం జ‌రిగిందనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి అమెజాన్ డాట్‌కామ్‌ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్ నిరాక‌రించారు.

ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అయిన అంతర్గత ఈమెయిల్ లో యువకుల్లో బాగా ప్రాచుర్యం పొందిన వీడియో అనువర్తనం టిక్‌టాక్‌ను తొలగించమని ఉద్యోగులకు అమెజాన్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 8.4 లక్షలమంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన అమెజాన్ టిక్ టాక్ కు వ్యతిరేకంగా వెళ్లడంపై ఒత్తిడి పెరిగిందని భావిస్తున్నారు. ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ యాప్‌పై నిషేధం విధించాలని యోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news