రూ.1799కే బోట్ నూత‌న స్మార్ట్‌బ్యాండ్‌..!

-

ఆడియో ప్రొడ‌క్ట్స్ త‌యారీదారు బోట్ భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్‌బ్యాండ్‌ను విడుద‌ల చేసింది. ప్రొగేర్ బి20 పేరిట ఆ బ్యాండ్ విడుద‌లైంది. ఇందులో 0.96 ఇంచుల ఎల్‌సీడీ క‌ల‌ర్ ట‌చ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ 4.0 ఆధారంగా ఈ స్మార్ట్‌బ్యాండ్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు క‌నెక్ట్ అవుతుంది. అందుకు ఆండ్రాయిడ్ వెర్ష‌న్ 4.4 పైన లేదా ఐఓఎస్ వెర్ష‌న్ 8.0పైన ఓఎస్ క‌లిగిన డివైస్‌లు ఉండాలి.

boAt ProGear B20 smart band launched in India

ఈ బ్యాండ్‌లో ఆటోమేటిక్ స్లీప్ మానిట‌రింగ్‌ను అందిస్తున్నారు. 24 గంట‌లూ నిరంత‌రాయంగా హాట్‌రేట్‌ను ట్రాక్ చేసే సెన్సార్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. 14 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్‌ను అందిస్తున్నారు. ఫోన్ల‌లో వ‌చ్చే కాల్స్‌, మెసేజ్‌లు, సోష‌ల్ మీడియా నోటిఫికేష‌న్లు ఈ బ్యాండ్‌పై క‌నిపిస్తాయి. దీనికి ఐపీ 68 కెపాసిటీ క‌లిగిన వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు.

ఇందులో 90 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది. యూఎస్‌బీ క‌నెక్ట‌ర్ ద్వారా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. 10 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది.

బోట్ ప్రొగేర్ బి20 స్మార్ట్‌బ్యాండ్ బ్లాక్‌, బ్లూ, బీజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.1799 ధ‌ర‌కు ఈ బ్యాండ్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news