అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్‌.. ఎప్పుడంటే..?

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ఆగ‌స్టు 6వ తేదీ నుంచి ప్రైమ్ డే 2020 సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. కేవ‌లం అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న‌వారే ఈ సేల్‌లో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ సేల్ ఆగ‌స్టు 7వ తేదీనే ముగుస్తుంది. మొత్తం 48 గంట‌ల పాటు సేల్ కొన‌సాగుతుంది. ఇందులో అనేక ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను అందివ్వ‌నున్నారు.

అమెజాన్ ప్రైమ్ డే 2020 సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, అప్ల‌యెన్సెస్‌, టీవీలు, కిచెన్‌, నిత్యావ‌స‌రాలు‌, బొమ్మ‌లు, ఫ్యాష‌న్‌, బ్యూటీ ఉత్ప‌త్తుల‌పై బెస్ట్ డీల్స్‌ను అందివ్వ‌నున్నారు. అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ, కిండిల్ డివైస్‌ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఇవ్వ‌నున్నారు. శాంసంగ్‌, ఇంటెల్‌, జేబీఎల్‌, వ‌ర్ల్‌పూల్‌, ఫిలిప్స్‌, వ‌న్‌ప్ల‌స్‌, షియోమీ, బోట్ కంపెనీల‌కు చెందిన కొత్త ఉత్ప‌త్తుల‌ను ఈ సేల్‌లో విక్ర‌యిస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో ప్రైమ్ డే సేల్‌లో వ‌స్తువుల‌ను కొంటే 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ ఇస్తారు. అమెజాన్ పే ద్వారా రూ.2వేల వ‌ర‌కు రివార్డుల‌ను ఇస్తారు. ఇక మ‌రిన్ని డీల్స్ వివ‌రాల‌ను గురువారం నుంచి అమెజాన్ తెలియ‌జేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version