జనసేన పార్టీ అధినేత పవన్ వారాహితో యాత్ర ప్రారంభించిన నాటినుంచి ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రోజూ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. నిన్న కాకినాడలో పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ ఒక పిరికిపంద అని, అందుకే ప్రాణహాని అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు చేశారు మంత్రి అంబటి.
వారాహి అంటే అమ్మవారు అని, అమ్మవారిని వాహనంగా పెట్టుకుని, అమ్మవారి వాహనం ఎక్కి ఇలాంటి దుర్మార్గమైన మాటలు
మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు పుట్టగతులు ఉండవని మంత్రి అంబటి హెచ్చరించారు. రెండు చోట్ల ఓడిపోయావు… గుర్తుపెట్టుకో… మళ్లీ ఓడిపోతావు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
అంతేకాదు, వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు ఇక ఏ సినిమా హిట్ కాదని, ఇది అమ్మవారి శాపం అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాకినాడ వెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
“ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఏంచేస్తావ్ ఆయనను? ఆయనను రౌడీ, దుర్మార్గుడు అంటూ అవాకులు చెవాకులు పేలుతున్నావు. రూ.15 వేల కోట్లు దోచుకున్నాడని అంటున్నావు.
ఇంకొక మాట కూడా అన్నాడు…. ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు కానీ… అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతాడట. అబ్బబ్బబ్బ…. ఏం డైలాగయ్యా అది. ఓ ఎమ్మెల్యేని బట్టలూసడదీసి కొడతావా? అయ్యే పనేనా అది… నీకంత దమ్ము, ధైర్యం ఉన్నాయా? ప్రజాస్వామ్యంలో ఇది జరిగే పనేనా?