విద్యార్థులకు అలర్ట్‌.. బాస‌ర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

-

తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. గతంలో విడుదలైంది. అయితే.. దరఖాస్తుల గడువు ముగుస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాస‌ర ఆర్జీయూకేటీలో ప్రవేశాల ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా విద్యార్థుల‌కు ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఆర్జీయూకేటీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను జులై 3వ తేదీన విడుద‌ల చేయ‌నున్నట్లు బాస‌ర ట్రిపుల్ ఐటీ అధికారులు వెల్ల‌డించారు.

ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version