సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌కు మరికొద్ది రోజుల సమయం ఉండటంతో ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంబటి రాంబాబుకు ఓటు వేయకండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
అయితే, ఆ వీడియోలో గౌతమ్, మామ అంబటిని దుర్మార్గుడు, దుష్టుడు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పొన్నూరు సభలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు.తనకు ఓటు వేయొద్దని అల్లుడు గౌతమ్ చెప్పాడని.. ఆ వ్యాఖ్యలను తాను పట్టించుకోనని తెలిపారు. తన కూతురు, అల్లుడు రాజకీయ నాయకులు కారని.. ఇద్దరూ వైద్యులేనని,వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని అన్నారు.అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడే వాడిని కాదని.. ఆయన మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడంటూ మండిపడ్డారు.