ఎస్ఈసీ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేయటం దురదృష్టకరం అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. నిమ్మగడ్డ రాజ్యాంగ స్ఫూర్తి తో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో పని చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో లేని అధికారాన్ని ప్రదర్శించాలనుకుంటే మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో రిలీజ్ చేశారని ఆయనకు పిచ్చి ముదిరింది అని ఆయన అన్నారు.
ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో ఎలా విడుదల చేస్తారు? అని ప్రశ్నించారు. ఈ విషయంలో నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ తన ఓటు హక్కును దుగ్గిరాల లో తిరస్కరించారని చెప్పారు, హైదరాబాద్ లో ఉండే వ్యక్తి కి దుగ్గిరాలలో ఓటు ఎలా ఇస్తారు? అని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన పోటుగాడు చంద్రబాబేనని. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండీ దిగజారడు భాష మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు.