ప్రీమియం స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ కంపెనీ మీద అమెరికా ప్రభుత్వం దావా వేసింది స్మార్ట్ఫోన్ మార్కెట్లో పోటీ లేకుండా చేయడం వినియోగదారుల మీద విపరీతమైన ఖర్చుల ద్వారా చట్ట విరుద్ధంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కారణంగా యుఎస్ న్యాయశాఖ ఆపిల్ పై దావా వేసిన ఆపిల్ అనుసరిస్తున్న విధానాల వలన పోటీ కంపెనీలు మార్కెట్లో నిలదోక్కుకోవడమే కష్టంగా మారింది.
ఈ పరిణామాలతో కలిసి వచ్చిన అవకాశాన్ని ధరలను కృత్రిమంగా పెంచి లాభపడుతుందని ప్రభుత్వం దావాలో చెప్పింది దీని వలన కొత్త ఆవిష్కరణలు కి అవకాశం లేకపోవడమే కాకుండా ఆపిల్ అనుసరించే విధానాలతో కష్టమర్లు ఇతర చౌకైన స్మార్ట్ఫోన్లు పరికరాలకి మారడం కష్టంగా మారిందని ఈ ఆరోపణలలో గుత్తాధిపత్యం కారణంగా సమస్యను ఎదుర్కొంటున్న గూగుల్ మెటా అమెజాన్ సంస్థల జాబితాలో ఆపిల్ కూడా చేరింది. ఆపిల్ కంపెనీ మీద అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో షేర్లు బాగా తగ్గాయి ఒక్కరోజులోనే షేర్ ధర నాలుగు శతానికి పైగా నష్టపోయింది.