ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం చేయ‌డానికి కార‌ణం అమెరికానే : ఉత్త‌ర కొరియా

-

ఉక్రెయిన్ – ర‌ష్యా దేశాల మ‌ధ్య ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్న విషయం తెలిసిందే. యుద్ధంగా కొన‌సాగుతుంది. కాగ ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధంపై ఉత్త‌ర కొరియా మొద‌టి సారి స్పందించింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం చేయ‌డానికి.. ఈ ఉద్రిక్తత ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం అమెరికానే అని ఉత్త‌ర కొరియా ఆరోపించింది. ఉక్రెయిన్ సంక్షోభానికి ప్ర‌ధాన కార‌ణం.. అమెరికానే అని తెలిపింది. అమెరికా ఏక ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, మిలిట‌రీ ఆధిప‌త్యాన్ని పెంచుకోవాల‌ని అమెరికా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అందుకే ఇలాంటి పరిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆరోపించింది.

త‌మ దేశ ఆధిప‌త్యాన్ని ఇత‌ర దేశాల‌పై రుద్దడం ఎందుక‌ని ప్ర‌శ్నించింది. శాంతి, సుస్థిర‌త పేరుతో ఇత‌ర దేశాల వ్య‌వ‌హరాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుంద‌ని తెలిపింది. అదే ఇత‌ర దేశాలు త‌మ దేశ రక్షణ కోసం మ‌రో దేశం గురించి మాట్లాడితే.. అమెరికా త‌ట్టు కోవ‌డం లేద‌ని మండి ప‌డింది. అమెరికాకు ప్ర‌పంచాన్ని ఎలాల‌నే కోరిక ఉంద‌ని, అధికార దాహం ఎక్కువ‌గా ఉంద‌ని ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news