బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిదేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి?

-

ఈ మధ్య పాపులర్ అవుతున్న డైటింగ్ ప్రక్రియల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఒకటి. నిజానికి ఇది డైట్ కాదు. డైట్ చేసే విధానం. దీనిలో ఏయే పొషకాలు తినాలి అనే దాని కంటే ఏ సమయాల్లో తీసుకోవాలి అనేది ముఖ్యంగా ఉంటుంది. భోజనానికీ భోజనానికీ మధ్య ఎంత గ్యాప్ ఉంటుందనేది ఇంటర్మిటెంట్ లో ఫాస్టింగ్ ముఖ్యమైన అంశం. ఎక్కువ సమయం ఏమీ తినకుండా ఉండి, ఆ తర్వాత ఆహారం తీసుకోవడమే దీని ప్రత్యేకత. అందుకే బ్రేక్ ఫాస్ట్ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కిందకి వస్తుంది. చాలా గంటలు కడుపు ఖాళీగా ఉన్న తర్వాత ఆహారం తీసుకుంటాం, అంటే ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తాం కాబట్టి, దాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు.

మరి బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిదా అన్న విషయం చర్చిద్దాం.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో చక్కెర నిల్వలను బాగా తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. టైప్ 2డయాబెటిస్ ని నివారించడంలో ఇది కీలకంగా ఉంటుంది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి గుండెకు చేటు చేయకుండా చేస్తుంది.

సైడ్ ఎఫెక్ట్స్

ప్రతీ డైట్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టే దీనికీ ఉన్నాయి. మొదటగా ఈ ఫాస్టింగ్ ప్రారంభించినపుడు తలనొప్పి వస్తుంటుంది. ఆకలి అవుతుండడం వల్ల మీ మీ మూడ్ దెబ్బతిని చిరాకు ఎక్కువ అవుతుంటుంది.

మీకు సరిపోతుందా?

బరువు తగ్గాలన్న ఉద్దేశ్యంతో మీ శరీరానికి సూట్ అవని డైట్ ఫాలో కావద్దు. అది మి శరీరం మీద బాగా ప్రభావం చూపెడుతుంది. ముందుగా మి శరీరాన్ని మీరు అర్థం చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news