వాహనదారులకు శుభవార్త.. రేపటి నుంచే పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌ అమలు

-

తెలంగాణలో పెండింగ్‌ చలాన్ల వాహనదారులకు గుడ్‌ న్యూస్ చెప్పింది పోలీస్‌ శాఖ. వాహనాల చలాన్ల పెండింగ్‌ పై ఇటివలే పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా చలాన్ల పెండింగ్‌ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీస్‌ శాఖ.. పెండింగ్‌ చలాన్లకు భారీగా రాయితీలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే.. టూ, త్రీ వీలర్స్‌, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇవ్వాలని.. ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయానికి వచ్చింది. అలాగే.. కార్లు, హెవీ వెహికిల్స్‌ కు 50 శాతం రాయితీ ఇవ్వాలని డిసైడ్‌ అయింది.

అంతేకాదు.. మాస్కులు ధరించని వారి ఫైన్ల కు భారీ రాయితీ ఇవ్వనుంది. చలాన్‌లో విధించిన వెయ్యికి రూ.100 చెల్లిస్తే ఫైన్లు మొత్తం క్లియర్ అయినట్లేనని పేర్కొంది. మార్చి 1 నుంచి 31 వరకు ఈ-చలాన్ల వెబ్‌సైట్లో పేమెంట్లు జరుగనున్నాయి. అలాగే.. ఆన్‌లైన్‌లో, లోక్‌ అదాలత్‌ చెల్లింపునకు అవకాశం ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news