సిరియా, ఆఫ్ఘన్ లో సైనికుల ఆగడాలు… చిన్నారులపై దారుణాలు…!

-

పదేళ్ళ చిన్నారి… ఆకలి బాధలు తట్టుకోలేక… పహారా కాస్తున్న సైనికుడి వద్దకు వచ్చింది… చేయి చాచి తన మాతృ భాషలో తన కడుపు నింపమని కోరింది… కట్ చేస్తే… ఆ చిన్నారి రెండు గంటలు ఆగి ఇంటికి వచ్చింది. తల్లి తండ్రుల వద్ద కడుపు నొప్పితో ఏడుస్తూ కూర్చుంది. ఏంటి అని అడిగారు… ఏం జరిగిందో చెప్పడం ఆ చిన్నారికి రావడం లేదు… వెంటనే తల్లి తండ్రులు పక్కింట్లో తమ వస్తువులు తాకట్టు పెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లగా… ఆమెపై అత్యాచారం జరిగిందని తేల్చారు… అప్పుడు పాపను అడిగారు ఏం జరిగిందని,

జరిగిన విషయం చెప్పింది ఆ పాప. కాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ తల్లి తండ్రులది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు. వేలాది మంది చిన్నారులు అత్యాచారాలకు గురి అవుతున్నారు. అంతరుధ్యతో సిరియాలో ప్రవేశించిన అమెరికా, రష్యా, టర్కీ సహా అనేక పెద్ద దేశాల సైనికులు ఈ ఆగడాలకు పాల్పడుతున్నారు. వందల మంది జీవితాలను యుద్ధం వెనుక నాశనం చేస్తున్నారు. ఆకలి అంటూ వచ్చిన చిన్నారుల మీద తమ కర్కశత్వాన్ని చూపిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికులు తమ కోరికలను ఆ చిన్నారుల మీద చూపిస్తున్నారు.

సిరియా ఆఫ్ఘనిస్తాన్ లో ఇదే పరిస్థితి ఉంది. భర్తల ముందే భార్యలను సైనికులు అత్యాచారం చేస్తున్నారు. ఒక పక్క ఉగ్రవాదంలో ప్రాణాలు కోల్పోవడం, మరో పక్క సైనికుల చేతిలో జీవితాలు కోల్పోవడంతో అక్కడి ప్రజలకు ఇప్పుడు బ్రతుకు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. తినడానికి తిండి లేదు, ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుదామంటే ఉపాధి లేదు. దీనితో వేలాది మంది సైనికుల బూట్ల కింద నలిగిపోతున్నారు. యుద్ధం పేరుతో అగ్ర రాజ్యాలు తమ సైనికులను దింపి, అక్కడి ప్రజలను ఇలా అన్ని రకాలుగా వేధిస్తున్నాయి. ఐరాసా సహా ఎన్ని మానవ హక్కుల సంఘాలు దీనిపై ఆవేదన వ్యక్తం చేసినా లాభం లేకుండా పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news