అమెరికా ఆర్థిక బాధ్యతలు మహిళలకే..!?

-

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ లోని మూడు ముఖ్య ఆర్థిక బాధ్యతలను మహిళలకు అప్పగించారు. వైట్ హౌస్ కు అత్యంత కీలకమైన బడ్జెట్, ప్రెస్ టీంలను పూర్తిగా మహిళలకే సారథ్యం కల్పించారు. దీంతో అమెరికాను మున్ముందు నడిపించబోతున్నది మహిళలు మాత్రమేనని స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువశాతం మహిళలకు పదవులు కేటాయించడంపై జో బైడెన్ స్పష్టతనిచ్చారు.

usa budjet

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కు పోలైన ఓట్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారట. ఓటు హక్కును అస్త్రంలా ఉపయోగించుకుని తనను గెలించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకు నిదర్శనంగా వైట్ హౌస్ లోని మూడు ముఖ్య ఆర్థిక బాధ్యతలను మహిళలకే అప్పగించారు. ప్రెస్ టీంలో కూడా మొత్తం మహిళలతోనే భర్తీ చేశారు. ఈ టీంతో కలిసి జో బైడెన్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

వైట్ హౌస్ ఆర్థిక విభాగానికి సంబంధించి నీరా టాండన్ ను బడ్జెట్ డైరెక్టర్ గా నియమించారు. ఎకనామికల్ అడ్వైజర్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా సెసీలియా రౌజ్, ట్రెజరీ సెక్రటరీగా జానెట్ ఎలెన్ ను నియమించారు. ఈ మూడు విభాగాలు వైట్ హౌస్ లో ఉన్న అమెరికా స్ట్రాంగ్ రూంలోని డబ్బు బీరువాల్లాంటివి. వాటి తాళం చెవిలను కొత్త అధ్యక్షుడు జో బైడెన్.. నీరా, రౌజ్, జానెట్ చేతికిచ్చారు.

వైట్ హౌస్ లో ఏడుగురు సభ్యుల ప్రెస్ టీంలో కూడా అందరూ మహిళలే ఉన్నారు. ప్రెస్ టీం డైరెక్టర్ గా కేట్ బెడింగ్ ఫీల్డ్, ప్రెస్ సెక్రటరీగా జెన్ ప్సాకి, సైమన్ శాండర్స్ ఉపాధ్యక్షురాలి ముఖ్య ప్రతినిధి, కమ్యూనికేషన్ డైరెక్టర్ గా యాష్లీ ఎటిన్ హ్యారిస్, ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కెరీన్ జీన్ పియరీ, ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ కమ్యూనికేషన్ డైరెక్టర్, డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా పిలి తోబర్. ఈ ఏడుగురూ బైడెన్ గెలుపులో కీలక పాత్రను పోషించారు. అందుకే బైడెన్ ఈ మహిళలకు ఉన్నత పదవులు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version