వ్యాక్సిన్ తీసుకున్నా వచ్చేస్తున్న కరోనా… ఏకంగా డాక్టర్ కే…!

-

అమెరికాలోని కాలిఫోర్నియాలో 45 ఏళ్ల నర్సు ఫైజర్ తయారు చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ అందుకున్న వారం కరోనా బారిన పడినట్టు అమెరికా మీడియా వెల్లడించింది. రెండు వేర్వేరు స్థానిక ఆసుపత్రులలోని నర్సు… మాథ్యూ డబ్ల్యూ. డిసెంబర్ 18 న ఫేస్‌బుక్ పోస్ట్‌ లో తనకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పింది. వ్యాక్సిన్ వేసుక తర్వాత తన చేయి ఒక రోజు నొప్పిగా ఉందని, కానీ వేరే ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదని స్పష్టం చేసింది.

ఆరు రోజుల తరువాత క్రిస్మస్ పండుగ సందర్భంగా, తాను కరోనా యూనిట్‌ లో షిఫ్ట్ పనిచేసిన తరువాత అనారోగ్యానికి గురయ్యా అని పేర్కొన్నారు. ఆమె చలి జ్వరం తర్వాత కండరాల నొప్పులు మరియు అలసట వచ్చాయని పేర్కొన్నారు. ఆమె డ్రైవ్-అప్ హాస్పిటల్ లో టెస్టింగ్ కి వెళ్లి కరోనా పరీక్షా చేయించుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. అసలు తాము ఊహించలేదు అని అంటు వ్యాధి నిపుణుడు క్రిస్టియన్ రామెర్స్ పేర్కొన్నారు.

అయితే “టీకా నుండి మీరు రక్షణను పెంచుకోవడానికి 10 నుండి 14 రోజులు పడుతుందని టీకా క్లినికల్ ట్రయల్స్ నుండి ఈ విషయం మాకు తెలుసు” అని రామెర్స్ చెప్పారు. “మొదటి మోతాదు మీకు 50% రక్షణ ఇస్తుందని మేము భావిస్తున్నామని ఆయన చెప్పారు. 95% వరకు పొందడానికి మీకు రెండవ మోతాదు అవసరం” అని రామెర్స్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news