వైరల్ అవుతున్న అమెరికా యువతి పెళ్లి ఆహ్వానం…!

-

ఇంట్లో పెళ్లి జరుగుతుందంటేనే సందడి మొదలవుతుంది. చుట్టాలు, స్నేహితులతో ఇల్లంతా సరదాలతో, సంతోషాలతో కోలాహలంగా ఉంటుంది. ఇక పెళ్లి పిలుపుల విషయానికి వస్తే, అదొక పెద్ద పనే. ఈమధ్య కాలం లో వధువు, వరుడు ఇద్దరు కలిసివెళ్లి పెళ్లి శుభలేఖలు ఇవ్వటం మాములు అయిపోయింది. అయితే ఓ అడుగు ముందుకేసిన ఓ యువతి తన వివాహనికి ఇస్తున్న ఆహ్వానం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆ వివరాలలోకి వెళ్తే..

అమెరికాకు చెందిన ఓ యువతి తన వివాహ ఆహ్వాన పద్ధతిని మార్చేసింది. అందరిలాగే వివాహానికి ఆహ్వానిస్తూనే, వచ్చేవారంతా తమతోపాట  50 డాలర్లు పెళ్లి బహుమతిగా తనకు తెమ్మని చెప్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని స్వయంగా, ఆ యువతి బంధువు అయిన మరో యువతి తెలిపింది. ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం, తన పెళ్ళికి వచ్చేవారంతా ముందుగానే తనకు 50 డాలర్ల బహుమానాన్ని ఆన్లైన్లో పంపాలని కోరిందట…

 

ఎందుకిల అని ఆ వధువుని అడగగా, పెళ్ళికి చాల ఖర్చు అవుతోంది, ఈ బహుమానాలతో కొంతైనా రికవరీ చేయడానికంటూ టక్కున బదులిచ్చిందట. దాంతో షాకైనా ఆమె, వెంటనే నీ పెళ్ళికి రావాటం మాకు కుదరదు, నీకు పెళ్లి శుభాకాంక్షలు కూడా ఫోనులోనే తెలుపుతూ  ఫోన్ పెట్టేసిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్తా వైరల్ అయింది.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news