Amigos Movie Review : అమిగోస్ ట్విట్టర్ టాక్… కళ్యాణ్ రామ్ దుమ్ములేపాడు భయ్యా

-

నందమూరి కళ్యాణ్ రామ్ బింసారా హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు అమిగోస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి.

ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయినా సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు ఇది రీమిక్స్‌. గతంలో బాలయ్య నటించిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్‌ బాలు – చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్‌లో రిమేక్‌ చేయించాడు కల్యాణ్‌ రామ్‌.

ఇక ఇవాళ ఆ సినిమా రిలీజ్‌ అయింది. దీంతో సోషల్‌ మీడియాలో రివ్యూ చెప్పేస్తున్నారు నెటిజన్లు. త్రిపుల్‌ రోల్‌ లో కళ్యాణ్‌ రామ్‌ ఆకట్టుకున్నాడని కొంత మంది నెటిజన్లు తెలిపారు. డిఫరెంట్‌ షేడ్స్‌ కలిగిన పాత్రల్లో వైవిద్యం చూపిస్తూ, మెప్పించారనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఆషీకా గ్లామర్‌, యాక్షన్ సీన్స్‌ ప్లస్‌ అయ్యాయి. సెకండ్‌ ఆఫ్‌ లో వచ్చే బాలయ్య రీమిక్స్‌ సాంగ్‌ ఎన్నో రాత్రులు సినిమాకు ప్లస్‌ అయింది. అటు కామెడీ సీన్స్‌ కూడా అదిరిపోయాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news