అర్హులకు పట్టా భూమి.. అమ్మాయి పుడితే రూ.50వేలు.. త్రిపుర ప్రజలకు బీజేపీ హామీల వర్షం

-

త్రిపురలో ఎలాగైనా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ఆదివాసీల నుంచి ఎదురవుతున్న అసమ్మతిని చల్లబరచటానికి, రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవటానికి త్రిపురలో బీజేపీ ఉచితాలతో కూడిన అనేక హామీల వర్షం కురిపించింది. ఈనెల 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం మేనిఫెస్టో ప్రకటించింది.

త్రిపురలో మళ్లీ తమకు అధికారం అప్పగిస్తే ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని మాటిచ్చింది. త్రిపుర ఆదివాసీ ప్రాంత స్వయం ప్రతిపత్తి మండలిని పునర్‌వ్యవస్థీకరించటంతో పాటు మహారాజా విక్రమ్‌ మాణిక్య పేరిట ఆదివాసీ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే బాలికాసమృద్ధి యోజన కింద రూ.50వేల బాండ్‌ ఇస్తామన్నారు.

కాలేజీల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కూటీలు, గృహిణులకు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో భూమిలేనివారికి పట్టాభూమి పంపిణీ చేస్తామని నడ్డా చెప్పారు. పీఎం కిసాన్‌ కింద రైతులకు అందిస్తున్న సాయాన్ని రూ.6వేల నుంచి రూ.8వేలకు పెంచుతామని హామీల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news