Amigos : అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా NTR

-

నందమూరి కళ్యాణ్ రామ్ బింసారా హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది.ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి.


ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయినా సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు ఇది రీమిక్స్‌. గతంలో బాలయ్య నటించిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్‌ బాలు – చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్‌లో రిమేక్‌ చేయించాడు కల్యాణ్‌ రామ్‌. ఇప్పుడు ట్రైలర్ ను చిత్రాయూనిట్ రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ హైదరాబాద్‌ లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news