తెలంగాణ లో ఎన్నికల నగారా మోగిందో లేదో పొలిటికల్ హడావుడి మొదలైంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్న బీజేపీ అందుకు తగినట్లుగానే పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ రానున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ మల్టీ పర్పస్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించే ఆదిలాబాద్ జనగర్జన సభకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో మేధావుల సదస్సులో పాల్గొంటారు. తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు అమిత్‌షా. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి అనుసరించాల్సిన అంశాలపై లోతుగా చర్చ జరపనున్నారు.
అమిత్ షా షెడ్యూల్
* రేపు మధ్యాహ్నం గం.1.45 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం గం.2.35కు ప్రత్యేక హెలికాప్టర్‌లో అదిలాబాద్‌కు చేరుకుంటారు
* మధ్యాహ్నం గం.3 కు గం.4 వరకు అదిలాబాద్ సభలో పాల్గొంటారు.
* గం.4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు
* గం.5.05కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* గం.5.20 నుంచి సాయంత్రం గం.6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం
* గం.6 కు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు.
* గం.6.20 నుంచి గం.7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో సమావేశం
* రాత్రి గం.7.40 సయానికి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ.
* రాత్రి గం.9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్న అమిత్ షా.