రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

-

కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులకు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను విపక్షాలు తొలగించాలని కోరుతున్నప్పటికీ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో వాటిని తొలగించదని స్పష్టం చేశారు. “ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ వర్గానికి చెందినవారు. వెనుకబడిన తరగతుల కోసం బీజేపీ అనేక పథకాలు అమలు చేస్తోంది అని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా.. మేం అలా చేయం అని,ఇది మోదీ గ్యారంటీ అని అన్నారు. కాంగ్రెస్ వెనుకబడిన తరగతులను (ఓబీసీ) వ్యతిరేకించే పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదు అని అన్నారు. రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వెనుకబడిన కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపు కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు అని అమిత్ షా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news