ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు పార్లమెంట్ లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈనెల 3న ఉత్తర్ ప్రదేశ్ మీరట్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన అసదుద్దీన్ ఓవైసీపై దుండగులు కాల్పలు జరిపారు. యుపిలోని హాపూర్ జిల్లాలోని పిఎస్ పిల్ఖువా పరిధిలో టోల్ గేట్ వద్ద అసద్ కాన్వాయ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అసద్ పై జరిగిన దాడిపై రాజ్యసభలో 11.30 గంటలకు.. లోక్ సభలో సాయంత్రం 4.30 గంటలకు అమిత్ షా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.
ఈ ఘటన దేశంలో సంచలనం కలిగించింది. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసద్ హిందూ వ్యతిరేఖ కామెంట్లపై విసిగిపోయే తాము ఈ పనిని చేశామంటూ… నిందితులు ఒప్పుకున్నారు. కాగా ఈ దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి కేటాయించగా… అసద్ దాన్ని తిరస్కరించాడు.