హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే బీజేపీ, ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీని ఎలాగైనా ఈ ఎన్నికల్లో గద్దె దించాలని హర్యానా ప్రజలకు పిలుపునిచ్చారు. అదే టైంలో ఆయన కాస్త స్పృహ తప్పగా సిబ్బంది ఆయన్ను పట్టుకుని కుర్చీలో కూర్చొబెట్టారు. అనంతరం 2 నిమిషాల తర్వాత ఆయన తిరిగి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీని గద్దె దించేవరకు తాను చనిపోను అంటూ చివరలో కామెంట్ చేశారు.
తాజాగా మల్లిఖార్చున ఖర్గే చేసిన వ్యాక్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలు ప్రధాని మోడీ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత ద్వేషం ఉందో తెలియ జేస్తుందని వివరించే ప్రయత్నం చేశారు. ఖర్గే అనవసరంగా మోడీని ఆయన వ్యక్తిగత, ఆరోగ్య విషయాల్లోకి లాగారని చెప్పారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసి ప్రజల నుంచి సింపతీ కొట్టేయడంలో ఖర్గే అందరినీ మించిపోయారని అమిత్ షా విమర్శలు గుప్పించారు.