అమిత్ షాకు ప్లకార్డులతో నిరసన సెగ..!

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్లకార్డుల తో నిరసన సెగ. వివరాలను చూస్తే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో నిర్వహించిన జన సభ లో మాట్లాడారు. ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి సహారా పేమెంట్స్ చెల్లించాలని ప్లకార్డులు పట్టుకుని బాధితుల నిరసన చేసారు.

ఇది ఇలా ఉంటే అమిత్ షా నరేంద్ర మోడీని గెలిపించాలని అన్నారు 400 కి పైగా స్థానాల్లో భాజపాని గెలిపించాలని ఆయన కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా అయిన ప్రచారాన్ని నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన భాజపా సభ లో ప్రసంగించారు 12 స్థానాల్లో గెలిపించాలని ఓటర్లని అమిత్ షా కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news