ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..!

-

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసింది ఈసీ. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక షెడ్యూల్ లో మే 2న నోటిఫికేషన్ రానున్నట్టు తెలుస్తోంది. అలానే మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ వుంటుందట. మే13న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ గా ఉంది. ఇక మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటున్నట్టు తెలుస్తోంది. జూన్‌ 5న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

జనగమన నియోజకవర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది ఓటర్ నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్ ని వెల్లడించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేస్తుంది ఇదిలా ఉంటే 2021 మార్చి 14న బట్టబతుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఆ టైంలో 76 మంది వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడ్డారు ఇండిపెండెంట్గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టాప్ ఫైట్ ఇచ్చారు. పల్లా విజేతగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news