యూనియన్ హెల్త్ ఏజెన్సీ పార్ట్నర్స్ తో కలిసి కొత్త స్టడీ చేశారు. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఫిజికల్ లేదా సెక్సువల్ హింసకి గురి అవుతున్నారు. మంగళవారం ఈ రిపోర్టు విడుదలయింది. 2010 నుండి 2018 సంవత్సరం వరకూ ఈ రిజల్ట్స్ ని లెక్కించారు. అయితే ఈ స్టడీస్ ప్రకారం ఎక్కువగా మహిళలు గృహ హింస కి గురవుతున్నట్టు కనబడుతోంది.
చాలా ప్రదేశాల లో ఇది చోటు చేసుకుంటోంది. ప్రతి దేశంలోనూ కూడా ఈ దాడులు ఎక్కువ గానే ఉంటున్నాయి. చాలా మంది మహిళలు మరియు వాళ్ళ కుటుంబాలు వీటి వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyesus ఏమన్నారంటే..? కరోనా నేపథ్యం లో ఇది మరింత పెరిగిందని అన్నారు.
2013 నుంచి WHO చేసిన ఈ పరిశోధన లో మహిళలని పార్ట్నర్స్ హింస చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా లైంగిక హింస ఎక్కువగా మహిళల పై చేస్తున్నట్టు చెప్పింది. 736 మిలియన్ స్త్రీలు ఇటువంటి వాటికి గురవుతున్నట్లు తెలిపింది.
అదే మనం విశ్వమంతటా చూస్తే పార్ట్నర్స్ మరియు పార్ట్నర్ కాని వాళ్ళు సెక్సువల్ దాడులుని చేస్తున్నట్టు… పైగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఇటువంటి వాటికి గురవుతున్నారని Dr Claudia Garcia-Moreno WHO’s సెక్సువల్ అండ్ రేప్రొడ్యూక్టీవ్ హెల్త్ అండ్ రీసెర్చ్ యూనిట్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల పై హింస భాగస్వామి లేదా ఇతరులు చేసేది చూస్తే…ఇది 646 మిలియన్ మందిని ప్రభావితం చేస్తుందని తెలిపింది. 6 శాతం మహిళలు పార్ట్నర్స్ చేత కాకుండా ఇతరుల చేత లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు తెలుస్తోంది.