జగన్ కు షాక్ ఇచ్చిన అమరావతి రైతులు

-

కాసేపటి క్రితం ఏపి కేబినేట్ సమావేశం ప్రారంభమైంది. 27 ఎజెండా అంశాలతో ఏపి కేబినేట్ సమావేశం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాజధాని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుల రద్దుకు, అమరావతి డెవలప్మెంట్ పార్థనర్స్ (ఎడిపి) లిక్విడెషన్ ప్రక్రియకు ఏ ఎం ఆర్డీఏ కమిషనర్ సహా వివిధ అధికారులకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు ఉండవచ్చు.

అయితే సిఎం జగన్ కు అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. జగన్ వెళ్తున్న సమయంలో మందడం ప్రాంత రైతులు నిలబడి జై అమరావతి అనే నినాదాలు చేసారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులు కనపడకుండా అడ్డంగా నిలబడ్డారు. ఇక సిఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version