ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 27 ఎజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. నివార్ తీవ్ర తుపాన్ వల్ల జరిగిన నష్టం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఏ మేరకు జరిగిందో కేబినెట్ లో చర్చ జరగనుంది. 30.20 లక్షల మందికి 22.57 డి పట్టాలతో కలిపి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. డిసెంబర్ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రొపోజల్ పై కేబినెట్ లో చర్చ జరగనుంది.
వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్ లకు ఈ క్యాబినెట్ లో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం (రీ సర్వే ప్రాజెక్ట్ ) కు ఆమోద ముద్ర వేయనుంది ఏపీ కేబినెట్. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్డినెన్స్ 2020 సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్. ఇక ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ప్లే గ్రౌండ్, స్టాఫ్ క్వార్టర్స్, కాలేజ్ బిల్డింగ్ ల నిర్మాణానికి మాచర్లలో భూములు కేటాయింపు వంటి అంశాల మీద చర్చ జరగనుంది. 99 సంవత్సరాలు లీజ్ కు కేటాయించనుంది ఏపీ కేబినెట్. ఇంకా మరిన్ని అంశాలను ఈరోజు క్యాబినెట్ చర్చించనుంది.