సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అమృత ప్రణయ్..?

-

మృత ప్రణయ్ పరువు హత్య.. రెండు రాష్ట్రాలో ఎంతటి సంచలనం సృష్టించిందో దాదాపు అందరికీ తెలిసిందే. వీరిద్దరి ట్రూ లవ్ కి.. వీరికి జరిగిన అన్యాయానికి సమాజమంతా స్పందించారు. తాజా సమాచారం ప్రకారం.. అమృత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల బెదురులంక 2012 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తికేయ తో డ్యాన్స్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా రొమాంటిక్ యాంగిల్ లో చేసిన ఈ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరి నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రణయ్ని మరిచిపోయిందని.. సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోబైపు బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూడా అమృత ప్రణయ్ పెర్ఫామెన్స్ ని అభినందిస్తూ.. ఫైర్ అండ్ లవ్ ఎమోజీలను షేర్ చేసింది. ఇప్పటికే అమృత సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాల్లో ఎంట్రీ పై ఫోకస్ పెట్టిన అమృత ప్రణయ్.. సినిమా ఇండస్ట్రీ వాళ్లతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. అమృత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వీడియోలను చూస్తుంటే.. త్వరలో సినిమాల్లోకి రావడం కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news