అమృత.. ఆఖరి చూపు చూడకుండానే మారుతీరావు అంత్యక్రియలు

-

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆదివారం హైదరాబాద్ లో ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు స్వస్థలం మిర్యాలగూడ తీసుకువచ్చారు. అక్కడ బందువులు హైందవ సాంప్రదాయంలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు.

అయితే తండ్రి మారుతీరావు అంత్యక్రియలకు అమృత పోలీసుల సహకారంతో రాగా… అయితే బంధువులు అమృత రాకను అడ్డుకున్నారు. మారుతీరావు మృతదేహాన్ని చూడటానికి కూడా అమృత కు బంధువులు అవకాశం ఇవ్వలేదు. అమృత తండ్రిని ఆఖరి చూపు చూడకుండానే మారుతీరావు మృతదేహానికి బందువులు అంత్యక్రియలు పూర్తిచేశారు.

మారుతీ రావు మృతిపై అమృత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పశ్చాత్తాపంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించింది. అమృత తల్లి కూడా అమృతను రానీయలేదు. ఎటువంటి సంఘటనలు జరగకుండా అమృత ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news