తెలుగుదేశం పార్టీని మరియు చంద్రబాబుని తన మీడియాలో మోయటం లో ABN RK చాలా సిద్ధహస్తులు. అదే సందర్భంలో జగన్ ని నైతికంగా రాజకీయంగా దెబ్బతీయడానికి కూడా ABN RK తన మీడియా ని ఉపయోగించుకునే అనేక కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి అండగా ABN RK ముందునుండి మీడియా రంగంలో వ్యవహరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సమయంలో ABN RK వైయస్సార్ సిపి పార్టీ పై మరియు జగన్ పై ఇష్టానుసారం అయిన రాతలు రాయటం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో తన మీడియా సమావేశాలకు ABN మీడియా ఛానల్ ప్రతినిధులను బహిరంగంగానే రావద్దని కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ వదలలేదు…తగ్గలేదు ఏబీఎన్. అంతగా వైయస్ జగన్ పై రెచ్చిపోయే ABN RK తాజాగా తోక ముడిచారు అని ఏపీ రాజకీయాల్లో టాక్. విషయంలోకి వెళితే ప్రతీ వారం తన కొత్తపలుకు లో …వైయస్ జగన్ ప్రభుత్వం పైన విషం జల్లె వార్తలు రాసే రాధాకృష్ణ తాజాగా…స్థానిక సంస్థల ఎన్నికల గురించి చంద్రబాబుకి కనీ వినీ ఎరుగని షాకిచ్చే న్యూస్ ఆర్టికల్ రాయటం జరిగింది.
శత్రువు మంచి జోరు మీద ఉన్న సమయంలో పోరాడకుండా పారిపోతే బాగుంటుందని ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. ముఖ్యంగా అమరావతి విషయంలో పెద్దగా టిడిపి సాధించింది ఏమీ లేదు… కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా.. స్థానిక సంస్థల్లో టీడీపీ ఓడిపోతే.. మూడు రాజధానులకు.. ఆ జిల్లాల వాళ్లు కూడా మద్దతిచ్చారని చెప్పుకుని జగన్.. మరింత దూకుడుగా.. రాజధాని మార్చుతారని.. ఆర్కే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఓట్లు కూడా చీలుతాయని రాధాకృష్ణ విశ్లేషించారు. మొత్తంమీద చూసుకుంటే తన మీడియాలో ఎప్పుడూ చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించే ఏబీఎన్ ఆర్కే…లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయకపోతే బెటర్ అని చెప్పటం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.