ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విషయంలో నేను మీడియా ముందుకు రావట్లేదంటూ ప్రకటించారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు అమృత. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగిందని తెలిపారు.

ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నానని ప్రకటించారు. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ధన్యవాదాలు చెప్పారు. నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను మీడియా ముందుకు రావట్లేదని వివరించారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అటూ కోరారు అమృత. కాగా… ప్రణయ్ హత్య కేసులో నిందితుల్లో ఉరిశిక్ష, కొందరికి జీవిత ఖైదు పడింది.