తెలుగు ఎన్నారై లకు కోపం తెప్పించిన ఆ సీరియల్ నిర్మాత…!!

-

తీరిక సమయాలలో కుటుంబం మొత్తం కలిసి కూర్చొని టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. ఇలా అంతా కూర్చొని చూసేటప్పుడు హస్యబరిత కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. ఇలా పాపులర్ సీరియల్స్ లో ఒకటి  అమృతం. ఒకప్పుడు జెమినీ టీవిలో ప్రతి ఆదివారం రాత్రి 8.30 నిమిషాలకు ప్రసారం అయ్యేది. ఇది మన దేశంలోనే  కాదు అమెరికా లో కూడా పాపులర్ అయ్యింది.

యూట్యూబ్ లో  ఈ సీరియల్ ఎపిసోడ్స్ చూస్తూ అమెరికా లోని భారతీయులు చాల ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి గతం లో చూసిన సీరియల్ అయిన కూడా యూట్యూబ్ లో ఇంత పాపులర్ అవటానికి కారణం అమెరికా అభిమానుల ఆదరణని  చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఈ సీరియల్ నిర్మాతపై ఎన్నారైలు చాల కోపంగా ఉన్నారు. అందుకు కారణం యూట్యూబ్ నుంచి అమృతం ఎపిసోడ్స్ ని తీసివేయటం.

అంతేకాదు ఈ సీరియల్ రైట్స్ ని జీ తెలుగు కి అమ్మేశారు. ఇంతగా ఆదరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు , ఇకపై ఈ సీరియల్ ను వీక్షించాలనుకుంటే జీ తెలుగులోనే చూడాలి అంటూ ఒక వీడియో కూడా పెట్టారు ఆ నిర్మాత. దాంతో ఎన్నారైల ఆగ్రహం తార స్థాయికి వెళ్ళింది. వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఇప్పుడు జీ తెలుగు లో చూడాలంటే సబ్ స్క్రిప్షన్ డబ్బులు ఎవరు చెల్లిస్తారు అంటూ, మేము ఇదివరకే అమృతం సీరియల్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news