ప‌ది పాస్ అయ్యారా.. అయితే డీఆర్‌డీఓలో ఉద్యోగాలు మీకోస‌మే..

పదవ తరగతి పాసైనవారికి గుడ్ న్యూస్. 10వ తరగతి అర్హతతో 1817 పోస్టుల్ని భర్తీ చేయబోతోంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-DRDO. ఈ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ క్రమంలో… దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీఓ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఒకేసారి 1,817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా పోస్టుల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. దరఖాస్తులకు 2020 జనవరి 23 చివరి తేదీ.

మల్టీ టాస్కింగ్ పోస్టులకు అర్హతల వివరాలు చూస్తే.. పదవ తరగతి, ఐటీఐ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 100. డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ తదితర ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను drdo.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చేు.