కోకాపేటలో ఎకరం రూ. 60 కోట్లు పలికిన ధర : సర్కార్‌ కు 2 వేల కోట్ల లాభం !

-

హైదరాబాద్‌ లోని కోకాపేటలో ప్లాట్ల ధర భారీగా పలికింది. కోకాపేట లో గరిష్టంగా ఎకరం ధర రూ. 60 కోట్లు పలికింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం… కోకాపేట లో ఉన్న 49 ఎకరాలను వేలం వేసింది హెచ్‌ఎండీఏ.

 

neopolis
Neopolis

ఈ భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా రూ. 2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 109, 239, మరియు 240 లో ఉన్న భూముల్లో 49 ఎకరాలను 8 ప్లాట్లుగా విభజించి వేలంలో పెట్టింది హెచ్‌ఎమ్‌డీఏ.

సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియో పోలీస్‌ లే అవుట్లతో పాటు, గోల్డెన్‌ మెయిల్‌ లే అవుట్‌ ప్లాట్లను ఆన్‌ లైన్‌ వేలం ద్వారా విక్రయించారు. ఇక్కడ భారీ భవనాలు నిర్మించేలా విశాలమైన రోడ్లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, తాగు నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే ఈ భూములు ఎక్కువ రేటు పలికాయి.  దీనిపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. కోకాపేటలో యావరేజ్‌గా ఎకరం ధర రూ. 40 కోట్లు పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news