షర్మిలకు రేవంత్ ఆ ఛాన్స్ ఇస్తారా?

-

ఉమ్మడి నల్గొండ….దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లా. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం ఈ జిల్లాలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే ఇక్కడ కాంగ్రెస్‌కు తిరుగుండేది కాదు. రాష్ట్ర విభజన జరిగాక జరిగిన ఎన్నికల్లో అంటే 2014లో ఇక్కడ 12 సీట్లలో కాంగ్రెస్ 6 గెలుచుకుంది. ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. కానీ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో నల్గొండలో కాంగ్రెస్ కుదేలైంది.

ys-sharmila-revanth-reddy

ఇక 2018 ఎన్నికల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ మూడుచోట్ల గెలిచింది. అందులో చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. అటు ఉత్తమ్ కుమార్ ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్‌కు ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. అది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన కూడా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.

అయితే రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో, నల్గొండ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకా కాంగ్రెస్‌కు బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి ఇంకా పలువురు నాయకులు నల్గొండ కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్‌కు కాస్త దూరంగా ఉన్నారు. పీసీసీ రాలేదనే కోపంతో కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్‌కు దూరం జరిగారు.

ఇక ఆయన్ని కలిసి బుజ్జగించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నల్గొండలో పలువురు సీనియర్ నేతలని రేవంత్ కలిశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే కాస్త దూరంగా ఉన్నారు. వారిని కూడా లైన్‌లో పెడితే నల్గొండలో కాంగ్రెస్ మరింత యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటినుంచి కష్టపడితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ని నిలబెట్టోచ్చు. ఇక్కడ బీజేపీకి పెద్ద బలం లేదు. అయితే కొత్తగా పార్టీ పెడుతున్న షర్మిల వల్ల కాస్త ఎఫెక్ట్ అవ్వోచని తెలుస్తోంది. వైఎస్సార్ అభిమానులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. వారిని తనవైపుకు తిప్పుకుంటే కాంగ్రెస్‌కు నష్టం జరగొచ్చు. మరి చూడాలి షర్మిలకు రేవంత్ ఆ ఛాన్స్ ఇస్తారో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news