కల్మషం లేని సీఎంకి చెడ్డ పేరు వస్తుంది.. రఘు రామ ఆసక్తికర వ్యాఖ్యలు.?

-

ప్రతిపక్ష పార్టీలకు నిద్ర లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసిపి పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రతిపక్ష పార్టీ నేతలు లేవనెత్తని అంశాలను సైతం తెరమీదికి తెస్తూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు పార్టీకి విధేయుడని… అని చెబుతూనే మరోవైపు అనాల్సిన మాటలు అన్ని అనేస్తున్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇటీవలే తనపై వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు
చేశారు.

తననే కాదు తనతో సన్నిహితంగా వున్న ఎంపీలను సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని… రాయలసీమ లో కూర్చొని ఖబడ్ధార్ అంటే భయపడేవాడిని కాదు అంటూ హెచ్చరించారు రఘురామ . వైసీపీ ఎంపీ అయిన తనను సమావేశానికి పిలవకపోవడమేంటని ప్రశ్నించిన ఆయన.. దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అంటూ తెలిపారు. నా దిష్టి బొమ్మలు దగ్ధం కూడా మానుకోవాలి అంటూ హితవు పలికారు రఘురామకృష్ణంరాజు. అంతేకాదు నిష్కల్మషమైన ముఖ్యమంత్రికి చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా చెడ్డ పేరు వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రఘురామ.

Read more RELATED
Recommended to you

Latest news