ప్రభాస్ న్యూ లుక్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్..!

గత కొన్ని రోజుల నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ అభిమానులందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా… ఇటీవలే ఆదిపురుష్ అనే సినిమాని కూడా ప్రకటించిన విషయం.. ఇక మధ్యలో విభిన్నమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేసేందుకు కూడా గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు డార్లింగ్. దీంతో ఏ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అనేదానిపై.. ఇక సోషల్ మీడియాను ఆశ్రయిస్తూ వెతికే పనిలో పడ్డారు అభిమానులు.

అయితే అభిమానులందరికీ మరింత వినోదాన్ని పంచేందుకు తన అప్డేట్లను ఎప్పటికప్పుడు మెయింటెన్ చేస్తూ పోస్ట్ చేసేందుకు ప్రభాస్ కొత్త టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక స్టైలిష్ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తూ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసి లేడీ అభిమానులు అందరూ మరోసారి ప్రభాస్ పై మనసు పారేసుకుంటున్నారు. ఈ ట్రేండి ఫోటో పై మీరు కూడా ఓ సారి లుక్కేయండి.