క్యాబ్ డ్రైవర్ చేస్తున్న పాడు పనిని నేను గమనించిన వెంటనే అతడు తన ప్యాంటును సర్దుకున్నాడు. ఏమి జరగన్నట్లు నటించాడు. కొద్దిపాటి ధైర్యం కూడగట్టుకుని కేకలు వేసి కారును ఆపేలా చేశాను. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో సరిగ్గా లైట్లు లేని రోడ్డులో కారు ఉన్నది. డ్రైవర్ కారును ఆపాడు. నేను దిగగానే వెళ్లిపోయాడు. అని ఆ మహిళా జర్నలిస్టు తనకు జరిగిన అనుభవాన్ని వివరించింది.
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. ఆ యువతి పట్ల క్యాబ్ డ్రైవర్ ప్రవర్తించిన తీరుకు క్షమాపణ చెప్పిన బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించాడు.
ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసే మహిళా జర్నలిస్టు తన విధులను ముగించుకుని ఇంటికి వెళ్లడం కోసం బుక్ చేసుకున్న ఓలా క్యాబ్‌లో ఆ సంఘటన చోటుచేసుకున్నది. ‘నా సొంత ఇంటిగా భావించే బెంగళూరు నగరం ఈరోజు నాకు ఎట్టిపరిస్థితుల్లో సురక్షితం కాదనే ఫీలింగ్ కలిగించింది. ఎప్పటిలాగానే పని పూర్తిగానే ఇంటికి వెళ్లడం కోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాను. డ్రైవర్ జుగుప్సాకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతడు హస్త ప్రయోగం చేయడం నేను గమనించడంతో ప్యాంటును సర్దుకున్నాడు. ఆ సయమంలో నేను పోలీసులకు ఫోన్ చేయలేకపోయాను. అవును ఎమర్జెన్సీ నెంబర్ తెలుసు. కానీ, ఆ సమయంలో ఫోన్ గురించి ఆలోచించలేం అని ఆ జర్నలిస్టు వివరించింది.
క్యాబ్ డ్రైవర్ చేస్తున్న పాడు పనిని నేను గమనించిన వెంటనే అతడు తన ప్యాంటును సర్దుకున్నాడు. ఏమి జరగన్నట్లు నటించాడు. కొద్దిపాటి ధైర్యం కూడగట్టుకుని కేకలు వేసి కారును ఆపేలా చేశాను. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో సరిగ్గా లైట్లు లేని రోడ్డులో కారు ఉన్నది. డ్రైవర్ కారును ఆపాడు. నేను దిగగానే వెళ్లిపోయాడు. అని ఆ మహిళా జర్నలిస్టు తనకు జరిగిన అనుభవాన్ని వివరించింది.
ఈ సంఘటనపై ఓలా యాజమాన్యం స్పందించింది. ఆ క్యాబ్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.