జీవితంలో కొందరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తోటి వారిని అశక్తుడిగా మార్చే ప్రయత్నం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యేకష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేక కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
దీనికి దేవుడు, దెయ్యం అనే పేర్లను విరివిగా వాడుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఓ వృద్ధుడు దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు.. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి తనని దేవుడు పిలుస్తున్నాడని తోటి రోగులతో చెప్పాడు. కాసేపటికే ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.