ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత రోజా ఆరోపించారు. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ కేసును సీఎం చంద్రబాబు నాయుడు తొక్కిపెట్టారని.. దమ్ముంటే ఆ కేసుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరిపించాలని కోరారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని రోజా అన్నారు. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారని.. ఇప్పుడు దాన్ని రూ.76 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కూటమి సర్కార్ హయాంలో అమరావతిలో నిర్మాణ పనులు చాలా ఖరీదుగా మారాయని వ్యాఖ్యానించారు.
అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా అంటూ కూటమి ప్రభుత్వాన్ని రోజా నిలదీశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరగలేదని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.