సీఐడీ కార్యాలయానికి ఐపీఎస్‌ సీతారామాంజనేయులు

-

వైఎస్సార్సీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జెత్వానీపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో అరెస్ట్ చేసిన ఆయణ్ను విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు.  జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్​గా పని చేసిన ఆయన ఈ నటి కేసులో ప్రస్తుతం సస్పెన్షన్​లో ఉన్నారు.

ఇక హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు ఈ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. పీఎస్‌ఆర్‌తో పాటు సీఐడీ పోలీసులు పలు కీలకపత్రాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వాటి ఆధారంగా ఆయణ్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్నితో పాటు ఆంజనేయలు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉండగా.. ఐపీఎస్ ఆంజనేయులును పోలీసులు ఏ2గా చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news