సాగర్ డ్యాంపై ప్రమాదం.. ఆపరేటర్​కు తీవ్ర గాయాలు

-

నాగార్జునసాగర్ డ్యాంపై సాంకేతికపరమైనలోపంతో ప్రమాదం జరిగింది. సాగర్‌ 26వ క్రస్ట్‌గేట్ ఆపరేట్‌ చేస్తుండగా ఫ్యాన్‌ విరిగిపోయింది. ఈ ఘటనలో గేట్‌ ఆపరేట్‌ చేసిన వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుడిని స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం…. హైదరాబాద్‌కు తరలించారు.

విధి నిర్వాహణలో భాగంగా ఆపరేటర్‌ అజ్మతుల్లా…. 26వ క్రస్ట్‌ గేట్‌ సాంకేతిక పరమైన కారణాలతో మోటార్‌ ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోయాయి. ఫ్యాన్‌ రెక్కలు అజ్మతుల్లా కాలికి తగలటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల క్రస్ట్‌ గేట్లు మరమ్మతులు చేసినప్పటికీ ప్రమాదం జరగటంపై డ్యాం అధికారులు విచారణ జరుపుతున్నారు.

తన విధి నిర్వహణలో భాగంగా డ్యాం పైభాగాన గేట్స్ ఆపరేట్ చేసే విభాగంలో గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని తగ్గించే క్రమంలో 26వ క్రస్ట్ గేట్ కు సంబంధించిన మోటార్ ఫ్యాన్ రెక్కలు విరిగి పోయి తన కుడి కాలికి తగలడంతో కాలు కి తగిలి 70శాతం వరకు కాలు కు తీవ్ర గాయం అయ్యింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజ్మతుల్లా ను వెంటనే అధికారులు సిబ్బంది కలిసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. సాగర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం క్రస్ట్ గేట్ మోటార్ ఫ్యాన్ నుండి విరిగిపోయిన ఫ్యాన్ రెక్క ముక్క మోకాలి కింది భాగంలోనే ఉండిపోవడo తో మెరుగైన చికిత్స నిమిత్తం గాయపడిన సిబ్బందిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version