Anand Devarakond: ఆనంద్‌ దేవ‌ర‌కొండ “హైవే”.. ప్ర‌తి మ‌లుపులో ట్వీట్!

-

Anand Devarakond: క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయ‌న న‌టించిన తొలి సినిమా దొరసాని.. మంచి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్నాడు ఆనంద్ దేవరకొండ.ఆతర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం వంటి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ…సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్.

ప్రస్తుతం హైవే’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమా చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ వ‌స్తున్న ఈ చిత్రం శ్రీఐశ్వర్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. సీనియర్ ఫోటోగ్రాఫర్ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డిఫిరెంట్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.ఈ తాజాగా సినిమాను క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. ‘హైవే’ షూటింగ్ పూర్త‌యిన‌ట్టు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు పోస్ట‌ర్‌ను విడుదల చేశారు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని నిర్మాత వెంకట్‌ తలారి తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో చేసిన‌ట్టు తెలిపారు. ఈ సినిమాలో కొంత మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు కూడా నటించారు. వారి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని తెలిపారు నిర్మాత‌.

సైకో క్రై మ్‌ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్కించామ‌ని చిత్ర దర్శకుడు కేవీ గుహన్ తెలిపారు. చిత్ర నిర్మాణం కోసం చాలా అడ్వాన్స్‌డ్ టెక్నికల్ ఉపయోగించ‌మ‌ని తెలిపారు. ఈ సినిమాలో ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు, ట‌ర్నుల‌తో చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని తెలిపారు. షూటింగ్‌ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో క్రేజీ అప్‌డేట్స్‌తో వ‌స్తామ‌ని పేర్కొన్నారు. మా సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే.. సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది.

Read more RELATED
Recommended to you

Latest news