హుజూరాబాద్ బరిలో నలుగురు రాజేందర్ లు..ఇంటిపేరు కూడా అదే..!

హుజురాబాద్ ఉప ఎన్నికలకు నిన్న నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 39 మంది సభ్యులు ఎన్నికల బరిలో నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ నుండి గెల్లు శ్రీను, బిజెపి నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ లకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం నలుగురు రాజేందర్ పేరు గల వ్యక్తులు నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా నామినేషన్ వేసిన నలుగురు రాజేందర్ ల ఇంటి పేరు కూడా “ఈ” తో మొదలవడం ఆసక్తికరంగా మారింది. ఇక బిజెపి నుండి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈటల తో పాటు బరిలో (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) నుండి ఇమ్మడి రాజేందర్, (న్యూ ఇండియా పార్టీ) ఈసంపల్లి రాజేందర్, (ఆల్ ఇండియా బి సి ఓ బి సి) ఇప్పల రాజేందర్ లు నామినేషన్ లు వేశారు.