ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిరసన తెలుపుతున్న రైతులపై కి మంత్రి కొడుకు కారుతో దూసుకెళ్లడం పై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఘటనపై సిపిఐ మావోయిస్టు పార్టీ స్పందించింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.
దర్యాప్తులు పోస్ట్ మార్టం నివేదికలు అధికారంలో ఉన్న వ్యక్తులను కాపాడే తెలివైన మార్గాలని సంచలన ఆరోపణలు చేసింది. మోడీ పాలనలో వ్యవసాయ ఆదాయం తగ్గిపోతుందని పేర్కొంది. కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. ఉత్తరప్రదేశ్ తో పాటు వచ్చే ఏడాది రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.