ఆనంద్ మహింద్రా ట్వీట్ చూసారా…? మహారాష్ట్రకు సరిగా సరిపోతుంది…!

-

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శనివారం ఉదయం మారిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అధికారం దక్కి౦చుకున్నట్టే దక్కించుకుని చేజార్చుకుంది శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి… అనూహ్యంగా శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అప్పటి వరకు నమ్మకంగా ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీకి ద్రోహం చేసి బిజెపితో కలవడం వంటివి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది. ఇక ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని మూడు పార్టీలు అంటుంటే బతికిందని బిజెపి అంటుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ పరిణామాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఆ వీడియో ప్రకారం చూస్తే… రెండు జట్లు మధ్య కబడ్డీ మ్యాచ్ జరుగుతుండగా… అందులో ఓ జట్టు ఆటగాడు కూతకు వచ్చి… ప్రత్యర్ధి జట్టులో ఓ ఆటగాణ్ని తాకి ఔట్‌ చేసి… తిరిగి వెళ్తూ వెళ్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళను కవ్వించడం కోసం కోర్టు మధ్యలో ఉన్న గీత దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. దీన్ని అదునుగా చేసుకున్న ప్రత్యర్ధి జట్టులో అవుటైన ఆటగాడు…. వేగంగా లైన్‌ వద్దకు వచ్చి బలంగా…. తన ప్రత్యర్థి జట్టు ఆటగాణ్ని,

తమ వైపు లాగడంతో… మిగిలిన జట్టు సభ్యులంతా అతడికి సహకరించడంతో పాయింట్ వస్తుంది. చూసే వాళ్ళు అందరూ కూడా రైడర్ టీం దే పాయింట్ అనుకుంటారు. కాని ప్రత్యర్ధికి దక్కుతుంది… ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఇదే. అధికారం దక్కించుకున్నామని మూడు పార్టీలు భావిస్తున్న తరుణంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనితో అందరూ కంగు తిన్నారు. ఈ వీడియో ని పోస్ట్ చేసిన ఆయన… ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన పరిణామాలకు ఇంతకంటే బాగా వివరించగలమా..? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version