అంజలి జీవితాన్ని అతడే నాశ‌నం చేశాడ‌ట‌.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

-

అంజలి తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగులో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో అంజలి-జై డేటింగ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమకథ ఓపెన్ సీక్రెట్. కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో గడిపిన గతం కూడా వీళ్లకుంది. అలాంటి వీళ్లిద్దరూ తాజాగా విడిపోయారు. ఇక ఇప్పుడు ఈ తమిళ జంటపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసాడు. హీరోయిన్ అంజలి, హీరో జై క‌లిసి కెరీర్ ప్రారంభంలో జ‌ర్నీ సినిమాలో న‌టించారు. ఆ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఇక 2017లో అంజలి, జై కలసి బెలూన్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం తనకు తీవ్రమైన నష్టాలని మిగిల్చిందని నిర్మాత నందకుమార్ వాపోతున్నాడు. అంజ‌లి చాలా మంచి అమ్మాయ‌ని, కానీ ఆమె జీవితంలోకి హీరో జై వ‌చ్చిన త‌ర్వాత ట్రాక్ మారిపోయింద‌ని ఆయ‌న తెలిపాడు. అలాగే కొడైకెనాల్‌లో హీరో, హీరోయిన్ల‌కు వేర్వేరు రూమ్స్ బుక్స్ చేశాం. కానీ వారిద్ద‌రూ ఓకే రూమ్‌లో ఉండేవారు. మ‌రో రూమ్ క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాడని, దాంతో ఆ రూమ్‌కి రోజుకు పన్నెండు వేల రూపాయ‌లు చొప్పున అద్దె చెల్లించామ‌ని ఆయ‌న తెలిపాడు.

షూటింగ్‌లో అంజ‌లిని పేరు పెట్టి పిలిస్తే జై గొడ‌వ‌ప‌డేవాడని, మేడ‌మ్ అని పిల‌వాల‌ని లేకుంటే షూటింగ్ ఆపేస్తాన‌ని బెదిరించేవాడ‌ని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. కావాలనే షూటింగ్స్ ఎగ్గొట్టేవాడని, అంజలి చేత కూడా రకరకాల సాకులు చెప్పి షూటింగ్స్ కాన్సిల్ చేయించాడని నందకుమార్ ఆరోపించారు. ఇలా అంజలి కెరీర్ తో జై ఆడుకున్నాడని అంటున్నాడు. అలాగే హీరో జై వల్లే తనకు నష్టాలు ఎదురయ్యాయని ఆరోపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version