జగన్ కు షాక్ : కొత్త పార్టీ పెట్టనున్న ఆనందయ్య

కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎంత ఫేమస్ అయిందో .. ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే.. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా  నెల్లూరు ఆనందయ్య సంచలన కామెంట్స్ చేశారు.

కరోనా మందు తయారీ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అడు గడుగున కరోనా మందు తయారీ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఆనందయ్య.

అంతే కాదు త్వరలోనే యాదవుల రాజకీయ పార్టీ ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు కృష్ణ పట్నం ఆనందయ్య. మిగిలిన బీసీ కులాల తో కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశం లో నిర్ణయించామని పేర్కొన్నారు కృష్ణ పట్నం ఆనందయ్య. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రధ యాత్ర నిర్వహణ కు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు కృష్ణ పట్నం ఆనందయ్య.