అనంతపురం : మహిళా కానిస్టేబుల్ తో అఫైర్… షాక్ ఇచ్చిన ఎస్పీ..!

-

తోటి ఉద్యోగిని తో అక్రమసంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ కు ఎస్పీ షాక్ ఇచ్చారు. అనంతపురం కనగాపల్లి మండలం తగరకుంట కు చెందిన హర్ష వర్ధన్ రాజు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. హర్షవర్ధన్ రాజుకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ యువతితో రెండేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో హర్షవర్ధన్ రాజుకు 20 లక్షల కట్నం 10 తులాల బంగారం ఓ కారు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హర్ష వర్ధన్ రాజు కు కొన్నేళ్ల క్రితం ఏ ఆర్ విభాగంలో మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధం గా మారింది.

దాంతో హర్షవర్ధన్ రాజు మహిళా కానిస్టేబుల్ ను తరచూ ఇంటికి తీసుకు వెళ్ళాడు. భార్య అడిగితే చెల్లి అని చెప్పడం మొదలు పెట్టాడు. కొంతకాలం ఓపిక పట్టిన భార్య ఒక రోజు నిలదీసింది. దాంతో పోలీస్ శాఖలో ఇలాంటివి సహజం లైట్ తీసుకోవాలి…. అంటూ సమాధానమిచ్చాడు. దాంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా హర్షవర్ధన్ రాజు భార్యను తీసుకురావడానికి అత్తగారి ఇంటికి వెళ్ళలేదు. దాంతో భార్య ఆమె తండ్రి కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించి హర్షవర్ధన్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version